Posts

Showing posts from April, 2008

మౌన యోగి

Image
చందమామ కొనగానే మొదట చదివేది విక్రమార్కుడి బేతాళ కథే.ఇది కూడ వారు ప్రచురించిన కథే...నేను కేవలం సేకరించి ఇక్కడ ఉంచాను పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి,, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఈ అర్ధరాత్రి వేళ, భయంగొలిపే ఈ శ్మశానంలో ఏ కార్యార్ధివై ఇన్ని ఇక్కట్లకు ఓర్చి శ్రమిస్తున్నావో తెలియదు. కానీ, నువ్వు మహాత్ముడు, మహా యోగి అని ఎవరినైనా నమ్మి వాళ్ళ కోసం ఇన్ని బాధలకు లోనవుతుంటే మాత్రం తగు హెచ్చరికలో వుండడం అవసరం. ఎందుకంటే, అలాంటివాళ్ళల్లో చాలామంది రాజాశ్రయంలో సుఖభోగాలు అనుభవించ వచ్చునన్న తాపత్రయంలో ఉంటారు. ఇందుకు ఉదాహారణగా, మౌనయోగి రాజు కనకసేనుడు అనే వాళ్ళ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను," అంటూ ఇలా చెప్పసాగాడు: మమతాపురి అనే నగరం శివార్లలోని కరుణానది తీరంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుండేది. ఆ చెట్టు కింద ఒక యోగి ఉండేవాడు. అతణ్ణి చూసిన జనం మొదట అతడొక పిచ్చివాడు అనుకున్నారు. కానీ, అతడిలో ఎలాంటి మతిభ్రమణ లక్షణాలూ కనిపించలేదు. అతడి వళ్ళ ఎవరికీ ఎన్నడూ ఎటువంటి కష్టమూ కలగలేదు. అందువల్ల అతడ...