Posts

Showing posts from January, 2008

సుమతీ శతకం

చిన్నప్పుడు పద్యాలు బాగా చెప్పేదాన్ని,బళ్ళో చేరక ముందునుంచే,అమ్మ పద్యాలు నేర్పించడం నాకు బాగా గుర్తు ...ఇప్పుడు ఆ రోజులు తల్చుకుంటే మన తర్వాత తరం వాళ్ళు చాలా మిస్సవ్వబోతున్నారనిపిస్తుంది, కొన్ని పద్యాలు గుర్తు చేసుకుందామా,...పద్యాలు మాత్రమేకాదు అప్పటి జ్ఞాపకాలు కూడా తప్పకుండా గుర్తొస్తాయి. **************************************** ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్ నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ! **************************************** పుత్రోత్సాహము తండ్రికి బుత్రుఁడు జన్మించినపుడే పుట్టదు జను లా పుత్రునిఁ గనుఁగొని పొగడఁగఁ బుత్రోత్సాహంబు నాడు పొందు ర సుమతీ ! **************************************** సరసము విరసము కొఱకే పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొఱకే పెరుఁగుట విరుఁగుట కొఱకే ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ ! **************************************** ఎప్పుడు సంపద కలిగిన నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్ దెప్పలుగ జెఱువు నిండినఁ గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ ! *************************************** ఎప్పుడుఁ దప్పులు వెదకెడు నప్పురుషునిఁ గ...