Posts

Showing posts from 2007

బుడుగు-చిచ్చుల పిడుగు

Image
నేను బాపు-రమణ గారి అభిమానిని.వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు. బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు లాంటి పదాలు వాడేస్తుంటాను. మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........ అమ్మ నన్ను ఎప్పుడేన కొడితే ,నాన్న అప్పుడు అమ్మకి ప్రెవేటు చెప్తాడు.నేను దెబ్బలాట అనుకున్నాను కానీ ,ప్రెవేటు అని బాబాయి చెప్పాడు.ఊసారేమో నాన్నేమో ,అమ్మ చెవి పట్టుకుని కీ ఇస్తున్నాడు,అంతట్లోకి నాకు ఆకలేసింది,అమ్మా ప్రెవేటు అయిందా,ఆకలేస్తోంది అన్నం పెట్టుదు గాని అన్నాను.అమ్మకి కోపం వచ్చింది కాబోలు,కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు.అందుకని ఛీ పోకిరీ వెధవకానా అంది కోపంగానూ,నవ్వుతూనూ.. నాకు తరవాత బాబాయి చెప్పాడు.ప్రయివేటు చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని.ఇగో ఈ పెద్దవాళ్ళేం,ఎప్పుడూ ఏమిటీ సరిగ్గా చెప్పరు.దీన్నే లోపం అంటారుట.ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం.

బుడుగు-చిచ్చుల పిడుగు-2

Image
అప్ప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రయివేటు మేష్టారుట.ఎవడికి తెలుసు ముందస్తుగా వాళ్ళేనా చెప్పాలి , లేకపోతే అమ్మా నాన్నా యేనా చెప్పాలి . ఇలాగే అయితే పిల్లలు వూరుకోరు,నేను మంచి వాణ్ణి కాబట్టి (అప్పుడు అందరూ నన్ను పెంకి వెధవాయి అన్నా పోన్లే కదా అని,ఆ మేష్టారు చేత మూడ్రోలు దాకా ప్రయివేటు చెప్పించాను,అదె ఇంకొడైతేన ఒకరోజు కూడా ఆ ఛాన్సు ఇవ్వడు.నా దగ్గర పది మంది మాష్టార్లు పని చేసారనుకో,వాళ్ళందరూ నిఝెంగా మంచివాళ్ళే.కాని పాపం రెండ్రోలో పదకొండ్రోలో అయ్యాక వాళ్ళే మానేసేవాళ్ళునన్ను భరించలేను అని చెప్పారుట నాన్నతో.(భరించటం అంతే మొయ్యటం అని బాబాయి చెప్పాదు)ఉత్త అబధ్ధం.నేను వాళ్ళ వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుదూ అనలేదు కూడా.అయినా వాళ్ళలా అనడం అన్యాయం కాదూ? అని అడుగుతున్నాను. అయితే అన్యాయం అని తెలీదు వాళ్ళకి.అపార్ధం తెచ్చుకున్నారన్నమాట.అంటే కోపం తెచ్చుకొవడంట.ఇలా అయితే పిల్లలు ఎంత అపార్ధం తెచ్చుకోవాలి.ఒక మాట చెప్తా విను.నేనున్నాననుకో.నాకు ప్రయివేటు చెప్పిన ఒక్కొక్క మేష్టారూ ఒక్కొక్కలాంటి వాడు.ఒక మేష్టారెమొ నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడమ వేపుకి తిప్పుతాడు కదా.పోన్లే అని ఊరుకుంటామ ఇంకో కొన్నాళ్ళకి కొ...

బుడుగు-చిచ్చుల పిడుగు

Image
నేను బాపు-రమణ గారి అభిమానిని. వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు. బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు లాంటి పదాలు వాడేస్తుంటాను. మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........ బుడుగు-చిచ్చుల పిడుగు నా పేరు బుడుగు అంటే పిడుగు.మా బామ్మ హారి పిడుగా అంటుంది,అందుకు.ఇంకో అస్సలు పేరు ఉంది.ఇప్పుడు చెప్పడానికి టైము లేదు.అది చాలా పొడుగు.కావలిస్తే మా నాన్నని అడుగు. అగో మా నాన్న.మా నాన్నకి నేను కొడుకు.ఇలా అని కొత్త ప్రైవేటు మాష్టారు చెప్పాడు వీడు మంచివాడు కాదు అంటే చెడ్డవాడు.అసలు వీడే కాదు ఈ ప్రైవేటు మాష్టార్లందరూ అంతే. చిన్న పిల్లలకి చదువు చెప్పడం రాదుపైగా సొంటి పిక్కలు తీస్తానంటారు.ఈడుకు తగని లెక్కలు చెయ్యమంటారు. ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మబాబోయ్ అనేసింది.(బామ్మకి అ,ఆ లు కూడ బాగా రావుట.). అంతేనేం మళ్ళా మాష్టారొస్తే రండి బాబూ అని చాపేస్తుంది.

సుస్వాగతం

Image
. . . . . . . . . . . తెలుగింటి చందమామకి సుస్వాగతం !!!!