బుడుగు-చిచ్చుల పిడుగు-2




అప్ప్పుడు వచ్చిన వాడే నాకు కొత్త ప్రయివేటు మేష్టారుట.ఎవడికి తెలుసు ముందస్తుగా వాళ్ళేనా చెప్పాలి , లేకపోతే అమ్మా నాన్నా యేనా చెప్పాలి .


ఇలాగే అయితే పిల్లలు వూరుకోరు,నేను మంచి వాణ్ణి కాబట్టి (అప్పుడు అందరూ నన్ను పెంకి వెధవాయి

అన్నా పోన్లే కదా అని,ఆ మేష్టారు చేత మూడ్రోలు దాకా ప్రయివేటు చెప్పించాను,అదె ఇంకొడైతేన ఒకరోజు

కూడా ఆ ఛాన్సు ఇవ్వడు.నా దగ్గర పది మంది మాష్టార్లు పని చేసారనుకో,వాళ్ళందరూ నిఝెంగా

మంచివాళ్ళే.కాని పాపం రెండ్రోలో పదకొండ్రోలో అయ్యాక వాళ్ళే మానేసేవాళ్ళునన్ను భరించలేను అని

చెప్పారుట నాన్నతో.(భరించటం అంతే మొయ్యటం అని బాబాయి చెప్పాదు)ఉత్త అబధ్ధం.నేను వాళ్ళ

వీపు మీద సవారీ చేస్తానని ఎప్పుదూ అనలేదు కూడా.అయినా వాళ్ళలా అనడం అన్యాయం కాదూ? అని

అడుగుతున్నాను.
అయితే అన్యాయం అని తెలీదు వాళ్ళకి.అపార్ధం తెచ్చుకున్నారన్నమాట.అంటే కోపం

తెచ్చుకొవడంట.ఇలా అయితే పిల్లలు ఎంత అపార్ధం తెచ్చుకోవాలి.ఒక మాట చెప్తా

విను.నేనున్నాననుకో.నాకు ప్రయివేటు చెప్పిన ఒక్కొక్క మేష్టారూ ఒక్కొక్కలాంటి వాడు.ఒక మేష్టారెమొ

నా చెవికి కీ ఇచ్చినప్పుడేమో ఇలా ఎడమ వేపుకి తిప్పుతాడు కదా.పోన్లే అని ఊరుకుంటామ ఇంకో

కొన్నాళ్ళకి కొత్తవాడొస్తాదు కదా ?


వాడెమోఅ చెవినే కుడి వేపుకి మెలిపెడతాడు.మళ్ళా ఇంకో మేష్టారు ఎడం వేపుకి తిప్పుతాడు.ఇలా అవుతే

చెవి పాడయిపోదూ...?
అంతే కానీ అయ్యో కుర్ర వెధవ ,వీడి చెవిని ఇదివరకటి మేష్టారుఎటు వేపు మెలివేసాడని అడుగుతాడా

అని చూస్తాను,ఎవ్వడూ అడగడు...పోనీ మా నాన్నా,అమ్మా ముందస్తుగా చెప్తారా ,చెప్పరు,నే నెందుకు

చెప్పాలి.చెప్పను.ఇప్పుడు చెప్తాననుకో...
యేమిటంటే,ముందు మేష్టర్లకి సలహాలు ఇస్తాను.యెందుకంటే మెష్టర్లంతే గురువు.గురువంటే

దేముడట.అందుకు....

Comments

Popular posts from this blog

మరికొన్ని సుమతీ శతక పద్యాలు ...

బుడుగు-చిచ్చుల పిడుగు

స్వార్ధపరుడు