మరికొన్ని సుమతీ శతక పద్యాలు ...
మరికొన్ని సుమతీ శతక పద్యాలు .... ఉత్తమ గుణములు నీచున కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా నెత్తిచ్చి కఱగిపోసిన నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ ! వివరణ : ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లుకానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు . --------------------------------------------------------- అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ! వివరణ : అడిగినప్పుడు జీతమియ్యని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది. -------------------------------------------------------- కనకపు సింహాసమున శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం దొనరఁగఁ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! --------------------------------------------------- స్త్రీల యెడల వాదులాడక బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నింద సేయకెన్నడు సుమతీ! వివరణ : స్త్రీలతో ఎన్నడూ గొడవ పడద్దు, చిన్న పి...