బుడుగు-చిచ్చుల పిడుగు
నేను బాపు-రమణ గారి అభిమానిని.వారి బుడుగు కి వీరాభిమానిని...వారు రాసిన బుడుగు-చిచ్చుల పిడుగు ఎన్నిసార్లు చదివానో తెలీదు.
బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు
లాంటి పదాలు వాడేస్తుంటాను.
మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........
బాపుగారి బొమ్మలు,రమణగారి మాటలు.....ఇప్పటికీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు హాచ్చెరం,బోల్డు
లాంటి పదాలు వాడేస్తుంటాను.
మన బుడుగు చేసిన అల్లర్లలో మచ్చుకి ఇక్కడ కొన్ని........
అమ్మ నన్ను ఎప్పుడేన కొడితే ,నాన్న అప్పుడు అమ్మకి ప్రెవేటు చెప్తాడు.నేను దెబ్బలాట
అనుకున్నాను కానీ ,ప్రెవేటు అని బాబాయి చెప్పాడు.ఊసారేమో నాన్నేమో ,అమ్మ చెవి పట్టుకుని కీ
ఇస్తున్నాడు,అంతట్లోకి నాకు ఆకలేసింది,అమ్మా ప్రెవేటు అయిందా,ఆకలేస్తోంది అన్నం పెట్టుదు గాని
అన్నాను.అమ్మకి కోపం వచ్చింది కాబోలు,కానీ అప్పటికింకా నవ్వు అయిపోలేదు.అందుకని ఛీ పోకిరీ
వెధవకానా అంది కోపంగానూ,నవ్వుతూనూ..
నాకు తరవాత బాబాయి చెప్పాడు.ప్రయివేటు చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని.ఇగో ఈ
పెద్దవాళ్ళేం,ఎప్పుడూ ఏమిటీ సరిగ్గా చెప్పరు.దీన్నే లోపం అంటారుట.ఇలా అని మనం అంటే మళ్ళీ కోపం.
Comments
bapu ramana gari budugu kadalu antee naku chala eshtam..mee blog loo chadivina taruvatha ...naa chinatam gurtukuvachi...
entho aanandam topatu refresh gaa nuvuntundi
marini kadala kosam vechichustunaa...:-)
thanks
bujji(surya)